![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-6 అయిపోయిన నాటి నుండి, అందులోని కంటెస్టెంట్స్ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన వాళ్ళు.. బయటకొచ్చాక మంచి పేరుని తెచ్చుకొంటారు. కాగా ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏదో ఒక షోలో సందడి చేస్తూ వస్తున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ రీసెంట్ గా మొదలైన 'బిబి జోడి' లో పాల్గొంటున్నారు. మరికొందరు సినిమాలలో అవకాశం రావడంతో షూటింగ్ లో బిజీ అయిపోయారు.
ప్రతి సంవత్సరం 'స్టార్ మా టీవీ' సంక్రాంతి పండుగకి ఒక ఈవెంట్ ని ప్లాన్ చేస్తుంది. అయితే ఈ సారి భారీగానే ప్లాన్ చేశారని, దానికి సంబంధించిన షూట్ కూడా స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సీరియల్ యాక్టర్స్.. ఇంకా కొంతమంది కమేడియన్స్ కన్పిస్తారని టాక్ నడుస్తోంది.
సంక్రాంతి వేడుకకి గీతు, ఫైమా, ఆదిరెడ్డి, రేవంత్ పాల్గొంటున్నట్టు ఒక పాటకి డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్ వీడియోను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆదిరెడ్డి, గీతు రాయల్, ఫైమా 'పల్సర్ బైక్' సాంగ్ కి మంచి మాస్ స్టెప్స్ వేస్తూ ఆ వీడియోను చేశారు. అయితే నెటిజన్లు ఆ వీడియోను చూసి "మేము కూడా ఎదురుచూస్తున్నాం" అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ సంక్రాతి ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యేలా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
![]() |
![]() |